అనగనగా రెండు పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటున్నాయి. నాదంటే నాదని హోరా హోరీ గా గొడవపడుతున్న ఆ పిల్లులను ఒక కోతి చూసింది.
ఎంత సేపటికి వాటి గొడవ తీరట్లేదు, ఈ సమస్యకు పరిష్కారం వాటికి తోచలేదు.
మొత్తానికి కోతి వాటిని విడతీసి, “ఇంతోటి దానికి ఎందుకు దేబ్బలాడుతున్నారు? మీ సమస్యకి ఒకటే పరిష్కారం. ఈ రొట్టె ముక్కని మీరు చెరి సగం పంచుకోండి. కావాలంటే మీ ఇద్దరికీ సమానంగా నేను పంచి పెడతాను” అని చెప్పింది.
కోతి మాట ఆ పిల్లులకు నచ్చింది. ఆ రొట్టి ముక్క ను కోతికి అంద చేసారు.
కోతి ఆ ముక్కను రెండు గా చేసింది. “అయ్యో! ఒక ముక్క పెద్దగా వుందే!” అని కోతి ఆ ముక్క ను కొంచం కొరికి తినేసింది.
“అరెరే! ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపొయింది!” అని రెండో ముక్కలో కొంచం తినేసింది.
“ఛ! ఇప్పుడు ఇది పెద్దగా అయిపొయింది!” అని మళ్ళి మొదటి ముక్కలో కొంచం తినేసింది.
ఇలా కొంచం కొంచం చేసి మొత్తం రొట్టె ముక్క కోతి తిని, తుర్రున చెట్టెక్కి పడుక్కుంది.
పిల్లులు రెండూ నోరు వెలేసి చూస్తూ వుండి పోయాయి. నిరాశగా వాటి దారిన అవి వెళ్లి పోయాయి. అందుకే, పెద్దలు మనకి ఎప్పుడు చెపుతూ వుంటారు – ఇద్దరి మధ్య గోడవయినప్పుడు లాభం ఎప్పుడు మూడో వారికి చండుతుందని.
chala bagunnayandi. elanti kathalu pillalaku cheppali. ma pillalaku vinipinchadaniki prayatnistunnanu. meku chala thanks.
A very nice story…
For Telugu Quotes visit https://iquotesdiary.blogspot.com/